
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడమే కాకుండా.. స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఈ సినిమాలో కుందవై పాత్రలో మైమరపించింది. ఇక ప్రమోషనల్లో అందంగా కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పటికే విజయ్ దళపతి సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తోంది.

ఇక మరోవైపు అజిత్ కొత్త సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ. తాజాగా మరో హీరోకు జోడిగా మారింది.

ఆ తరువాత కమల్ హాసన్ 234వ చిత్రంలోనూ ఈ అమ్మడే నాయకి అనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ధనుష్ సరసన మరోసారి జతకట్టే అవకాశం ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం.

వెండితెరపై అందాల తార జోరు.. మళ్లీ త్రిషకు వరుస ఆఫర్స్.. ఈసారి ఆ స్టార్ హీరో సరసన..

వెండితెరపై అందాల తార జోరు.. మళ్లీ త్రిషకు వరుస ఆఫర్స్.. ఈసారి ఆ స్టార్ హీరో సరసన..