
హీరోలు 40 ఏళ్లైనా స్టార్స్‌గా కొనసాగొచ్చు మన ఇండస్ట్రీలో.. కానీ హీరోయిన్లకు మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది. పదేళ్లు స్టార్ హీరోయిన్‌గా కొనసాగితేనే అమ్మో అనుకుంటారు.. అలాంటిది 20 ఏళ్లైనా ఇంకా అదే రేంజ్ మెయింటేన్ చేస్తున్నారు త్రిష.

ఈమె క్రేజ్ చూస్తుంటే అందరికీ మతిపోతుంది. ప్రస్తుతం టాప్ స్టార్స్‌తో జోడీ కడుతున్నారీ ఈ బ్యూటీ. అసలు త్రిషకు మాత్రమే ఇదెలా సాధ్యమవుతుంది.? ఏజ్ 40. కానీ క్రేజ్ మాత్రం ఇన్ఫినిటీ.. త్రిషను చూస్తుంటే ఇప్పుడిదే అనిపిస్తుంది.

హీరోయిన్లు ఈ రోజుల్లో మహా అయితే ఐదేళ్లు స్టార్ హీరోయిన్లుగా ఏలుతున్నారు.. కొందరికి అది కూడా సాధ్యమవ్వట్లేదు. కానీ త్రిష మాత్రం 23 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా PS 2తో పాటు ది రోడ్, లియో సినిమాల్లో నటించారు.

అలాగే మరో మూడు లైన్‌లో ఉన్నాయి. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. ఇంకోవైపు స్టార్ హీరోల సినిమాల్లో వరస అవకాశాలతో తగ్గేదే లే అంటున్నారు త్రిష. ముఖ్యంగా తమిళనాట అయితే త్రిష డేట్స్ కోసం క్యూ కడుతున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం మోహన్ లాల్‌తో రామ్.. అజిత్‌తో మగిల్ తిరుమేని తెరకెక్కిస్తున్న విడాముయార్చీలో నటిస్తున్నారు త్రిష. తాజాగా చిరంజీవితోనూ ఈమెకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభరలో త్రిష దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే మిగిలింది. స్టాలిన్ తర్వాత ఈ ఇద్దరూ నటించలేదు.. ఆచార్యలో అనుకున్నా వర్కవుటవ్వలేదు.

ఇన్నేళ్లకి ఆ ఛాన్స్ వచ్చింది. అలాగే నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోనూ త్రిష పేరునే పరిశీలిస్తున్నారు. ఏదేమైనా ఈమెకిప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తుందంతే.