
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ. కానీ ఇప్పుడు లెక్క మారింది. మన సినిమా బార్డర్స్ చెరిపేసుకుంటూ పోతోంది. ఆల్రెడీ నార్త్ మార్కెట్‌ను క్రాస్ చేసిన సౌత్ సినిమా నెక్ట్స్ ఇయర్ మీద అంచనాలు పెంచేసింది. ఆల్రెడీ లైన్‌లో ఉన్న సినిమాలు కూడా సౌత్ మార్కెట్ లెక్కలు మార్చేసేలాగే కనిపిస్తున్నాయి.

2023 ఇండియన్ సినిమాకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఆఫ్టర్ కోవిడ్ ప్రతీ ఏడాది తగ్గుతూ వస్తున్న బాక్సాఫీస్ ఆదాయం.. ఈ ఏడాది మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 500 కోట్లకు పైగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. యానిమల్, సలార్, డంకీ సినిమాల లెక్క ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి, 2023 కంప్లీట్ అయ్యే సరికి 12000 కోట్ల వసూళ్ల మార్క్ టచ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

2023 లెక్కల్లో నార్త్ సినిమాను బిగ్ మార్జిన్‌తో క్రాస్ చేసింది సౌత్. ఈ ఏడాది వచ్చిన 12000 కోట్లలో నార్త్ సినిమాల కాంట్రిబూషన్ 4,700 కోట్లు మాత్రమే. మిగతా అంతా సౌత్ నుంచి వచ్చిందే.

ఈ లెక్కలతో సౌత్ ఆదిపత్యం మరోసారి ప్రూవ్ అయ్యిందంటున్నారు ట్రేడ్ ఎనలిస్ట్స్. కాస్త జాగ్రత్త పడితే 2024లో సౌత్, నార్త్ సినిమాల మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుందన్నది ఓ అంచనా.

2024లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సౌత్ సినిమాల లిస్ట్ కూడా బాక్సాఫీస్ లెక్కల మీద ఆశలు కల్పిస్తోంది. పుష్ప 2, దేవర, గేమ్ చేంజర్, కల్కి 2898 ఏడీ లాంటి భారీ చిత్రాలు 2024 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ లిస్ట్‌లో పోల్చుకుంటే నార్త్ లైనప్ అంత స్ట్రాంగ్‌గా కనిపించటం లేదు. అందుకే నెక్ట్స్ ఇయర్ సౌత్ సినిమాల మీద ఫోకస్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది.