1 / 5
బ్రో ప్రీ రిలీజ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సోషియో ఫాంటసీగా తెరకెక్కిన సినిమా బ్రో. సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. సినిమా జులై 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. వర్షం కారణంగా సాయంత్రం 6 గంటలకు మొదలవ్వాల్సిన వేడుక.. రాత్రి 8.30 గంటలకు మొదలైంది. దీనికి పవన్ సహా చిత్రయూనిట్ అంతా వచ్చారు.