
AHA - సూపర్ విమెన్ మీ బిజినెస్ డ్రీమ్స్ కి డోర్ బెల్ అంటూ ఆహా సరికొత్త షో నేను సూపర్‌విమెన్‌తో సిద్ధమవుతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలకు విశేషమైన స్పందన వస్తోంది. విమెన్ ఎంట్రప్రెన్యుయర్స్ కోసం డిజైన్ చేసిన ఎక్స్ క్లూజివ్ షో నేను సూపర్ విమెన్. కంటెస్టంట్లు, ఏంజెల్స్ మధ్య జరిగే డిస్కషన్లు ప్రోమోలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నెల 21 నుంచి ఆహాలో ప్రసారం కానుంది నేను సూపర్ విమెన్. శుక్ర, శనివారాల్లో రాత్రి ఏడు గంటలకు ఈ షో ప్రసారమవుతుంది.

Vijay son - వారసుడు వస్తున్నాడు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 1999లో అజిత్, దేవయాని నటించిన నీ వరువాయన మూవీకి ఈ సినిమా సీక్వెల్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దేవయాని కుమార్తె ఇనియా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం. తన కుమారుడు సినీ రంగ ప్రవేశానికి రెడీగా లేరని గతేడాది చెప్పారు విజయ్.

Priyanka - ప్రియాంక సపోర్ట్ హాలీవుడ్‌లో జరుగుతున్నsag aftra Strike కి నటి ప్రియాంక చోప్రా తన మద్దతు తెలిపారు. నా యూనియన్‌తోనూ, కొలీగ్స్ తోనూ ఉంటాను. అందరం కలిసి మంచి భవిష్యత్తును సాధిద్దాం అని పోస్ట్ చేశారు ప్రియాంక చోప్రా. స్టైక్ పూర్తయ్యేవరకు ప్రపంచంలోని ఏ మూల కూడా తాను షూటింగ్‌లో పాల్గొననని చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్ ఆగిపోయింది.

Thamanna - ప్యార్‌లో పడితే తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని అన్నారు నటుడు విజయ్ వర్మ. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్టు ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందని చెప్పారు. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు, తనను ప్రేమిస్తున్నట్టు తెలిపారు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోయిందని, రొమాంటిక్ దశ మొదలైందని అన్నారు విజయ్ వర్మ. రీసెంట్‌గా వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్2లో యాక్ట్ చేశారు.

Jahnvi - మాతృదేవోభవ జాన్వీ కపూర్‌ని తల్లి శ్రీదేవి లడ్డూ అని పిలిచేవారట. శ్రీదేవి చనిపోవడంతో ఆ పిలుపునకు దూరమయ్యానని అన్నారు జాన్వీ. తన తల్లి కన్నుమూసినప్పుడు ధడక్ షూటింగ్‌లో ఉన్నానని అన్నారు. ఆ సమయంలో అటు వృత్తినీ, మనసు పిండేసే బాధనూ మేనేజ్ చేయడం కష్టంగా అనిపించిందని చెప్పారు జాన్వీ కపూర్. ఇప్పటికీ అంతా శూన్యంలానే ఉందని అన్నారు జాన్వీ.