
రీసెంట్‌గా గేమ్ చేంజర్‌లో డ్యూయల్ రోల్ చేశారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. సినిమా రిజల్టును పక్కనపెడితే, గ్లోబల్ స్టార్ పెట్టిన ఎఫర్ట్‌కి మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయనే చెప్పాలి. సినిమాలో చెర్రీ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది మరి.

ఇప్పుడు విశ్వంభరతో బిజీగా ఉన్న చిరంజీవి, నెక్స్ట్ చేయబోయే అనిల్ రావిపూడి సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తారని టాక్. మెగాస్టార్‌కి డ్యూయల్ రోల్ కొత్త కాకపోయినా, అనిల్ ఎలా చూపిస్తారోననే ఆసక్తి బాగా క్రియేట్ అయింది జనాల్లో.

ఇప్పుడు నీల్ సినిమాలో నటిస్తున్నారు తారక్. నెక్స్ట్ ఆయన కొరటాల దర్శకత్వంలో దేవర2లో యాక్ట్ చేస్తారు. సెకండ్ పార్టులో కచ్చితంగా తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలుంటాయి. తారక్‌ని తండ్రీకొడుకులుగా చూడ్డానికి ఈగర్‌గా ఉన్నారు అభిమానులు.

చిన్న క్లూ ఇవ్వకుండా, అప్‌డేట్ లేకుండా సైలెంట్‌గా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. ఎస్ఎస్ఎంబీ29లో మహేష్‌ని డ్యూయల్ రోల్‌లో చూపించే అవకాశాలున్నాయని అప్పట్లో టాక్ స్ప్రెడ్ అయింది. నిజానిజాలేంటన్నది జక్కన్నకు మాత్రమే తెలియాలి.

ఇటు ఐకాన్ స్టార్ - అట్లీ సినిమా మీద కూడా సేమ్ ఇలాంటి బజ్ క్రియేటైంది. మరోవైపు అల్లు అర్జున్ ట్రిపుల్ యాక్షన్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు సామ్. బన్నీ ట్రిపుల్ యాక్షన్ కోసం అల్లు ఆర్మీ మాత్రం ఇష్టంగా వెయిట్ చేస్తోంది.