Movie Shooting: పండగ నాడు షూటింగ్స్ లేక ఇండస్ట్రీ విల విల.. తిరిగి చిత్రీకరణలు ప్రారంభంతో కళ కళ..
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ అంతా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉంది. అదేంటి ఒక్కరు కూడా సెట్స్‌లో లేరా అనుకోవచ్చు. వినాయక చవితి కదా అందుకే అంతా హాయిగా ఓ రోజు సెలవు తీసుకున్నారు.. కానీ ఒక్కరు మాత్రం సెట్స్‌లోనే ఉన్నారు.. ఆయనే బాలయ్య. మరి మిగిలిన హీరోల పరిస్థితేంటి..? ఎప్పట్నుంచి షూటింగ్‌కు రానున్నారు..? వినాయక చవితి కారణంగా సెప్టెంబర్ 18న హీరోలంతా మూకుమ్మడిగా సెలవు తీసుకున్నారు. దాంతో ఎక్కడా ఏ షూటింగ్ జరగట్లేదు ఒక్క బాలయ్యది తప్ప. రామోజీ ఫిల్మ్ సిటీలో భగవంత్ కేసరితో బిజీగా ఉన్నారీయన. ఆల్రెడీ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. దొరికిన టైమ్‌ను సినిమా కోసం యూజ్ చేస్తున్నారు బాలయ్య.