Telugu Films: వీరి స్టయిలే వేరు.. అనౌన్స్‌మెంట్‌తోనే ఆసక్తి పెంచేసిన సినిమాలు..

| Edited By: Prudvi Battula

Mar 10, 2024 | 9:45 AM

నలుగురితో నారాయణ.. గుంపులో గోవిందా అన్నట్లు మనం కూడా ఉంటే.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. అందుకే చేసేది చిన్న సినిమానే అయినా.. ప్రమోషన్స్ మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అనౌన్స్‌మెంటే కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో గీతా ఆర్ట్స్ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివింది. మరి ఈ మధ్య అనౌన్స్‌మెంట్‌తోనే ఆసక్తి పెంచేసిన సినిమాలేంటి..?

1 / 5

2 / 5
చూస్తున్నారుగా.. తన సినిమా కోసం నిర్మాత బన్నీ వాసు కూడా కెమెరా ముందుకొచ్చి చిన్న స్కిట్ చేసారు. ఇలా ప్రకటిస్తే.. ఆడియన్స్ బుర్రల్లో కూడా సినిమా టైటిల్ బాగా రిజిష్టర్ అవుతుందనేది ఆయన ఆలోచన. అందుకే మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్‌తో ఆయన నిర్మిస్తున్న సినిమా టైటిల్‌ను ఇలా అనౌన్స్ చేసారు. దీనికి ఆయ్ అనే టైటిల్ ఖరారు చేసారు.

3 / 5
రోజుకు 10 సినిమాలు ఓపెనింగ్ అవుతున్న ఈ రోజుల్లో.. తమ సినిమాను గుర్తించుకోవాలంటే కొత్తగా ఏదైనా చేయాలి. అందుకే అనౌన్స్‌మెంట్‌నే డిఫెరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాను బార్ అండ్ రెస్టారెంట్ సీన్‌తో ప్రకటించారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దీనికి దర్శకుడు. ఇక శ్రీ విష్ణు, గీతా ఆర్ట్స్ సినిమాను సైతం వినూత్నంగా ప్రకటించారు.

4 / 5
నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాను కూడా ఫన్నీ వీడియోతోనే అనౌన్స్ చేసారు. ఆ మధ్య వెంకటేష్ సైంధవ్ సినిమాను ప్రకటించిన రోజే టీజర్ విడుదల చేసి ఆశ్చర్యపరిచారు దర్శకుడు శైలేష్ కొలను.

5 / 5
నిఖిల్ కార్తికేయ 2, నాగార్జున నా సామిరంగా, చిరంజీవి విశ్వంభర ఇలాంటి సినిమాలన్నింటికి ముహూర్తం రోజే కాన్సెప్ట్ వీడియోలు విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ మధ్య టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అయిపోయింది. 