
పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప అనే పాట విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీలోనూ విడుదల చేశారు. పాట మధ్యలో అల్లు అర్జున్ వాయిస్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది.

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా కృష్ణమ్మ. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఎస్.ఎస్.రాజమౌళి, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, కొరటాల శివ ట్రైలర్‌ని విడుదల చేశారు. మే 10న విడుదల కానుంది కృష్ణమ్మ. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. అతిరా రాజ్ నాయికగా నటించారు.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం విడుదల కానుంది ఆ ఒక్కటీ అడక్కు. చాన్నాళ్ల తర్వాత తనదైన కామెడీ జోనర్‌లో నరేష్ నటించిన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు మేకర్స్.

వెన్నెల కిశోర్, నందిత శ్వేత జంటగా నటిస్తున్న సినిమా ఓ ఎం జీ. ఓ మంచి ఘోస్ట్ అనేది ట్యాగ్ లైన్. హారర్ సన్నివేశాలకు హాస్యం జోడించి తెరకెక్కిస్తున్నామని అన్నారు వెన్నెల కిశోర్. లేటెస్ట్ గా ఈ సినిమా గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ప్రతి క్షణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు నందిత శ్వేత.

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" మే 10న రిలీజ్ అవుతుంది. ఆరంభం ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోందని అన్నారు మేకర్స్.