
నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరబాద్‌లో మొదలైంది. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఈ ఫైట్‌ను కంపోజ్ చేస్తున్నారు.

రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకుడు. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తూ డిజైన్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యమందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

కూతురి మృతిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు హీరో విజయ్ ఆంటోని. నా కూతురితో పాటే నేను కూడా చనిపోయానంటూ ట్వీట్ చేశారు. మీరా ఈ ప్రపంచం కంటే ప్రశాంతమైన మరోచోటికి వెళ్లిందని, ఇక మీదట సేవా కార్యక్రమాలన్ని కూతురి పేరుతోనే చేస్తానంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు విజయ్ ఆంటోని.

ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు త్రిష. 'నీ గురించి నీ టీమ్ గురించి నీకు తెలుసు, ఇక ఈ రూమర్స్ ట్రెండ్ చేయటం ఆపేయండి' అంటూ ట్వీట్ చేశారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కన్నూర్ స్క్వాడ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 28న కన్నూర్ స్క్వాడ్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్‌లో నటించారు మమ్ముట్టి.