
2024లో సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ సందడి సో సోగా కనిపించింది. సమ్మర్ అయితే పూర్తిగా వేస్ట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా, దీపావళి సీజన్ల మీద పడింది. మరి ఆ సీజన్లో అయినా సిల్వర్ స్క్రీన్ మీద సందడి కనిపిస్తుందేమో చూడాలి.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారం, హనుమాన్ మంచి విజయం సాధించాయి. అదే సీజన్‌లో రిలీజ్ అయిన సైంధవ్, నా సామిరంగ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తరువాత ఎలక్షన్ సీజన్ స్టార్ట్ కావటంతో భారీ సినిమాలేవి ఆడియన్స్ ముందుకు రాలేదు.

పొలిటికల్ హీట్, ఐపీఎల్ హడావిడి ఉండటంతో స్టార్ హీరోలెవరు సమ్మర్ బరిలో దిగలేదు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ లాంటి హిట్స్ వచ్చినా.. ఆ జోరును మరే సినిమా కంటిన్యూ చేయలేదు.

చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

మేజర్ సీజన్లు వేస్ట్ అయిపోవటంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా, దీపావళి మీదే ఉంది. ఆల్రెడీ దసరా సందడి ముందే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు దేవర. అక్టోబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాతో దసరా సందడి మొదలు కాబోతోంది.

దేవర గేట్స్ ఓపెన్ చేసినా.. ఆ జోరు కంటిన్యూ చేసేందుకు మాత్రం ఎవరూ కనిపించటం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కానీ..

ఆ సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయన్న విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. దీంతో దసరా సీజన్‌లో కూడా సందడి అనుకున్న రేంజ్‌లో ఉండదేమో అని ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్.