
కియారా అద్వానీ 2025 మెట్ గాలాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బేబీ బంప్‌తో ఫోటోలు దిగారు. అయితే ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తన మొదటి బిడ్డను త్వరలో జన్మనివ్వనుంది. గత ఏడాది వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.

టాలీవుడ్ యంగ్ కపుల్ కిరణ్ సబ్బవరం, రహస్య గోరక్ కూడా తల్లిదండ్రులు కానున్నారు. ఇది రహస్య తొలి కాన్పు. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి ధృవీకరించారు. గత ఏడాది వీరి వివాహం వైభవంగా జరిగింది.

అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కూడా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ మొదటి బిడ్డకి జన్మనివ్వనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నటి ఇలియానా డి'క్రూజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో భర్త మైఖేల్ డోలన్‌తో తన రెండవ గర్భధారణను ధృవీకరించారు. ఆగస్టు 2023లో తమ మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌ను స్వాగతించిన ఈ జంట తమ కుటుంబాన్ని విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నారు.

అమీ జాక్సన్ 2025లో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఉత్తేజకరమైన వార్తను పంచుకుంది. అభిమానులు తమ రెండవ బిడ్డ రాకతో సంతోషం వ్యక్తం చేసారు. ప్రేమ, ఆనందంతో తమ కుటుంబాన్ని మరింత విస్తరిస్తున్నారు.