
కూలీ సినిమాతో జనాలను పలకరించడానికి గొంతు సవరించుకుంటున్నారు శ్రుతిహాసన్. ఆగస్టు 14న ఈ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శ్రుతి.

సేమ్ డేట్‌కి వార్2తో జనాలకు హాయ్ చెప్తారు కియారా అద్వానీ. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో, వార్2 మీదే ఆశలు పెట్టుకున్నారు ఈ కాబోయే మాతృమూర్తి.

నెక్స్ట్ తెలుగు రిలీజులు ఏం ఉన్నాయ్ మేడమ్ అని ఆ మధ్య తిరుపతిలో పూజాహెగ్డేని అడిగితే.. ఏమాత్రం తడుముకోకుండా రెట్రో పేరు చెప్పేశారు. రెట్రోని మనవారు తమిళ సినిమాగా చూస్తుంటే, పూజా మాత్రం కంప్లీట్ తెలుగు సినిమాగానే ఫీలవుతున్నారు.

ధనుష్ ఇడ్లీకడైతో పలకరించడానికి రెడీ అవుతున్నారు నిత్యామీనన్. ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న త్రిష, నెక్స్ట్ థగ్‌లైఫ్ కోసం ఎదురుచూస్తున్నారు. పీయస్1, పీయస్2 తర్వాత మణిరత్నం డైరక్ట్ చేస్తన్న థగ్‌లైఫ్‌లో నటిస్తున్నారు త్రిష.

రీసెంట్ ఓదెల2 రిలీజ్ చూసిన తమన్నా, మే 1న రైడ్2తో పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌కి ఆల్రెడీ మంచి అప్లాజ్ అందుతోంది.