
సడన్‌గా రామేశ్వరంలో ప్రత్యక్షమైన మహనటి కీర్తి సురేష్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్‌లో పోజులిస్తున్న ఈ బ్యూటీ పక్కా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి, సముద్ర స్నానానికి వెళ్లారు.

ఈ మధ్యే ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ కూడా టెంపుల్ రన్ స్టార్ట్ చేశారు. కరోనా కేసులు కాస్త తగ్గుతుండటంతో భర్తతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ను వెంట తీసుకొని దక్షిణేశ్వర ఆలయంలో ప్రత్యక్షమయ్యారు.

కొత్త పెళ్లి కూతురు యామీ గౌతమ్ కూడా పక్కా ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నా... పూర్తి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత అంతా... హనీమూన్ ట్రిప్‌లకు వెళితే... యామీ మాత్రం టెంపుల్ రన్ మొదలు పెట్టారు.

ఎప్పుడూ బికినీల్లో కనిపించే మౌనీ రాయ్ కూడా రిలీజియస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. మదురై వెళ్లి దర్శనం చేసుకోవాలనుందంటూ తన మనసులోని కోరిక బయట పెట్టారు.

ఈ జనరేషన్ హీరోయిన్స్ ఆధ్యాత్మిక యాత్రల మీద దృష్టి పెడుతున్నారు. సినిమాలో ఎంత మోడ్రన్‌గా కనిపించినా... రియల్ లైఫ్‌లో మాత్రం పక్కా ట్రెడిషనల్ అంటున్నారు.