
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గుణశేఖర్.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. సోమవారం ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో అట్టహసంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యాక్రమానికి నటి సమంత లేజర్ కట్ పువ్వులతో తెల్లటి ఎంబ్రాయిడరీ అర్గాన్జా చీరకట్టులో అందంగా ముస్తాబై వచ్చింది.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు... ప్రధాన పాత్రలో హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ తెరకెక్కిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఇందులో విష్ణుకు అక్కగా హీరోయిన్ కాజల్ నటించింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు కాజల్ ఆలివ్ గ్రీన్ చీరలో వెండి సీక్విన్ బార్డర్ ఉన్న చీరకట్టులో కనిపించి చూపరులను ఆకర్శించింది.

చీరలకు గ్లామరస్ టచ్ ఇవ్వడం అంటే అందుకు మాలవికా మోహన్ సరిగ్గా సెట్ అవుతంది. ఎర్రటి రఫ్డ్ చీరతో స్లీవ్ లెస్ ఎంబ్రాయిడని బ్లౌజ్ ధరించిన సౌత్ బాంబ్ షెల్ మాలవికా మరింత అందంగా కనిపిస్తుంది.

ఇటీవల చెన్నైలో జరిగిన మ్యూజిక్ అవార్డులకు హాజరైన తర్వాత శ్రద్ధదాస్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలోని బుట్టబోమ్మ పాటకు చిందులేస్తూ కనిపించింది. ఈ వేడుకకు శ్రద్ద బుడిద రంగు చీరలో రఫ్డ్ లేస్ బోర్డర్ ఉండి.. బ్యాక్ లేస్ బ్లౌజ్ ధరించింది.

ఇటీవల విడుదలైన సితా ఆన్ ది రోడ్ సినిమాలో నటించిన కల్పిక గణేష్ మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో ఎరుపు, నీలం కలిసిన అద్దాల చీరలో తళుక్కున మెరిసింది.
