
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాంకర్లలో రవి కూడా ఒకరు. పటాస్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి గత పదేళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు

పటాస్ తో పాటు సమ్‌థింగ్ స్పెషల్, ఆడాళ్లా మజాకా.. తదితర టీవీషోలు యాంకర్ గా రవికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి

ఇక తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ రియాల్టీ షోలోనూ సందడి చేశాడీ స్టార్ యాంకర్.

అన్ని రకాల ఛానెల్స్ లో టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రవి తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.

ఈ సందర్భంగా తన భార్య నిత్యా సక్సేనా, కూతురు వియా తదిరులతో కలిసి కొత్త ఇంట్లో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రవికి అభినందనలు చెబుతున్నారు.