
సుమారు 8 ఏళ్ల క్రితం చిలసౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది.

చిలసౌ తర్వాత హిట్: ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, హర్ : ఛాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ ఔట్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది రుహాని శర్మ.

తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లోనూ యాక్ట్ చేసింది రుహాని. అయితే ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా రోజులైంది.

ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోన్న రుహానీ శర్మ తాజాగా తిరుమలలో తళుక్కుమంది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది.

తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రుహాని. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి