
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ అమ్మడు.

2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడు కేవలం నటనతోనే కాదు అందంలోనూ అదరగొడుతుంది ఈ భామ.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.

ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మెల్లగా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గుతూ వస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది నందిత. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మతిపోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలతో కవ్విస్తుంది నందిత.