Krithi Shetty: పువ్వులు సైతం పరవశించే అందం.. కృతి శెట్టి సొంతం
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలలా ఎగసి పడింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అంతే కాదు నటన, అందం పరంగా మంచి మార్కులు కొట్టేసింది కృతి శెట్టి. ఈ సినిమాతో బేబమ్మ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తర్వాత వరుస విజయాలను అందుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు మంచి హిట్స్ అందుకోవడంతో స్పీడ్ పెంచింది ఈ బ్యూటీ..