
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదిగాడం అంటే అంత సులభం కాదు.. అది కూడా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రాని హీరోయిన్స్ నిలదొక్కుకోవడం నిజంగా చాలా కష్టం. కానీ ఈ హీరోయిన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించి దూసుకుపోతోంది.

చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో సూపర్ హిట్స్ అందుకుంది. తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలు అందుకుంటుంది. ఆమె నటించిన సినిమా ఏకంగా 400కోట్లు వసూల్ చేసింది.

ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ అదా శర్మ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది.

బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. కానీ 'ది కేరళ స్టోరీ' సినిమా వల్ల ఈ బ్యూటీకి పాపులారిటీ బాగా పెరిగింది. అదా శర్మ తన సినిమాల కారణంగానే కాకుండా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి షిఫ్ట్ అయిన అదా చదువు గురించిన టాక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

నటి కావాలనే కోరికతో అదా కూడా చదువుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. చదువు పూర్తయ్యాక నటి కావాలని అదా శర్మ తల్లిదండ్రులు అదాకు సలహా ఇచ్చారు. అదా 12వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. అదా నటనతో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అదా శర్మ ఆస్తి విలువ 10 నుండి 12 కోట్ల రూపాయలు. క్రేజీ మూవీస్ లో నటిస్తుంది ఈ అమ్మడు.