నటుడు హర్షవర్ధన్ రాణే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చ తెలుగు నటుడైనప్పటికీ తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు. అవును, ఫిదా, గీతాంజలి, బెంగాల్ టైగర్ తదితర మువీల్లో నటించినప్పటికీ ఈ రాజమండ్రి కుర్రాడికి టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఐతే బాలీవుడ్‌లో మాత్రం అదృష్టం బాగా కలిసొచ్చింది. ఇలా తెలుగు, తమిళ, హిందీ చిత్ర సీమలో పలు సినిమాల్లో మంచి నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్థన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.
సినిమాల విషయం పక్కన పెడితే.. హర్షవర్ధన్ గతంలో కిమ్ శర్మ, మీనాక్షి దాస్ నటీమణులతో డేటింగ్ చేశాడు. ఐతే ఎందుకో వాళ్లతో సెట్‌కాక మధ్యలోనే విడిపోయాడు. తాజాగా హర్షవర్ధన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లైన ఓ నటితో డేటింగ్ ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ నటి సంజీదా షేక్‌తో కలిసి హర్షవర్ధన్ జూన్‌లో గిర్ ఫారెస్ట్‌కు టూర్‌కు వెళ్లారు. సంజీదాకు ఇప్పటికే పెళ్లయి కుమార్తె ఐరా అలీ ఉంది. ఆమె భర్త నటుడు ఆమిర్ అలీతో గతేడాది విడాకులు కూడా తీసుకుంది.
ప్రస్తుతం హర్షవర్ధన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో అదికాస్తా పుకార్లకు దారితీసింది. దీనిపై హర్షవర్ధన్ రాణే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం జర్నలిస్టులకు అలవాటేనని, ఇలాంటి పుకార్లను తాను పెద్దగా పట్టించుకోనని హర్షవర్ధన్ క్యాజువల్‌గా ఆన్సర్ ఇచ్చాడు.
సంజీదాతో హర్షవర్ధన్ బంధంపై నేరుగా స్పందించకపోవడంతో వీళ్ల డేటింగ్ నిజమేనని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా 'తైష్' అనే యాక్షన్ మువీలో సంజీదా, హర్షవర్ధన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.