అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌ ఎందుకు ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు? ‘ప్రేమ దేశం’ అబ్బాస్‌ మాటల్లోనే..

|

Jul 19, 2023 | 7:17 AM

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. తొలి చిత్రం 'ప్రేమ దేశం'తోనే స్టార్‌ డమ్‌ సొంతం చేసుకున్న హీరో అబ్బాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వరుస సినిమాలు చేశారు. తెలుగులో ‘నీ ప్రేమకై’, ‘అనగనగా ఒక అమ్మాయి వంటి..

1 / 5
ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. తొలి చిత్రం 'ప్రేమ దేశం'తోనే స్టార్‌ డమ్‌ సొంతం చేసుకున్న హీరో అబ్బాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వరుస సినిమాలు చేశారు. తెలుగులో ‘నీ ప్రేమకై’, ‘అనగనగా ఒక అమ్మాయి’, ‘రాజహంస’, ‘రాజా’, ‘కృష్ణబాబు’, ‘శ్వేతనాగు’, ‘నరసింహ’, ‘అనసూయ’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.

2 / 5
2015 నుంచి దాదాపు 8 ఏళ్లుగా ఆయన తెరమరుగయ్యారు. న్యూజిలాండ్‌ వెళ్లిన అబ్బాస్‌ ఇటీవలే ఇండియాకు వచ్చారు. తానెందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో అబ్బాస్‌ వెల్లడించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పి ఎమోషనల్‌ అయ్యారు. ఒకానొక సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, బైక్‌ బెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా కూడా పని చేసినట్లు చెప్పుకొచ్చారు.

3 / 5
నేను ప్రైవేట్‌ పర్సన్‌ని. బాధను లోపలే దాచుకుంటాను. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే నేను కొవిడ్‌ సమయంలో మాత్రం ‘జూమ్‌’ ద్వారా అభిమానులకు దగ్గరయ్యాను. వారితో మాట్లాడటం ద్వారా వారి ఫీలింగ్స్‌ తెలుసుకోగలిగాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాను. నేను కూడా టెన్త్‌ ఫెయిలైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరంకావడంతో ఆత్మహత్య ఆలోచన బలపడింది. కానీ ఆ ఆలోచన నుంచి బయటపడ్డా. ఈ విషయాన్నే కొవిడ్‌ సమయంలో నా అభిమానులతో పంచుకున్నా.

4 / 5
నేను నడుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండానే నటుడినయ్యా.19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నా. సాధారణ ప్రేక్షకుడిలానే నా ఫస్ట్‌ మువీ ప్రేమదేశం ప్రీమియర్‌కి వెళ్లా. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానుల్ని చూసి ఆశ్చర్యపోయా. వాళ్లెందుకు నాపై అభిమానం చూపించారో అప్పట్లో నాకు అర్ధం కాలేదు.

5 / 5
కెరీర్‌ తొలినాళ్లలో విజయాలు అందుకున్నా.. తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి. చివరిగా ‘పూవెలి’ చిత్రంలో నటించాను. కొన్నాళ్లకు నా పనిని నేను ఆస్వాదించలేకపోయా. అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పి న్యూజిలాండ్‌ వెళ్లాను. అక్కడ కుటుంబాన్ని పోషించేందుకు బైక్‌ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశానని అబ్బాస్‌ చెప్పారు.