
ఎన్సీ కరుణ్య - ఇండియన్ ఐడల్ సీజన్ 2 (2005-2006).. తెలుగు స్టేట్స్ నుంచి బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చిన కరుణ్య ఆచార్య థో ఫైనల్ వరకు వెళ్ళి రన్నరప్‌గా నిలిచాడు.

శ్రీరామ చంద్ర - ఇండియన్ ఐడల్ సీజన్ 5 (2010-2011).. కరుణ్య తర్వాత ఇండియన్ ఐడల్‌లో శ్రీరామ్ చంద్ర సంచలనం సృష్టించాడు. సూపర్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ.. సీజన్ 5 విన్నర్‌గా నిలిచాడు.

పీవీఎన్ఎస్ రోహిత్ -సీజన్ 9 (2016-2017).. సూపర్ సింగర్, పాడుతా తీయగా వంటి షోలలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని నేరుగా ఇండియన్ ఐడల్ వరకు వెళ్ళాడు సింగర్ రోహిత్. తమ అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఫైనల్ వరకు వెళ్ళి రన్నరప్‌గా నిలిచాడు.

ఎల్వీ రేవంత్.. సీజన్ 9 (2016-2017).. తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన రేవంత్.. ఇండియన్ ఐడల్ స్టేజ్ పై తన సత్తా చాటాడు. శ్రీ రామ చంద్ర తర్వాత ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచాడు రేవంత్.

శీరిష భాగవతుల- సీజన్ 12 (2020-2021).. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఐడల్ షోలో తన అద్భుతమైన గాత్రంతో దూసుకుపోతుంది శీరిష. గాయని చిత్ర గారి పాటలను తనదైన శైలీలో పాడుతూ..ఫైనలిస్ట్ రేసులో ఉంది ఈ యంగ్ టాలెంటెడ్ సింగర్.

షన్ముఖప్రియా.. సీజన్ 12 (2020-2021).. ప్రస్తుతం రన్ అవుతున్న ఇండియన్ ఐడల్ షోలో రాకింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో అటు ప్రేక్షకులను, ఇటు జడ్జీలను ఆకట్టుకుంటుంది షన్ముఖప్రియ. తనదైన స్టైల్లో సాంగ్స్ సెలక్ట్ చేసుకోని ఫైనలిస్ట్ రేసులో దూసుకుపోతుంది ఈ సింగర్.