
ఇందులో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా చెర్రీ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుందనే మాటను కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు దిల్‌రాజు. శంకర్ ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్కా అనే మాట కూడా వినిపిస్తోంది.

గేమ్ చేంజర్ క్రిస్మస్‌బరిలోనే... రెడీ అవ్వండి అంటూ దిల్‌రాజు అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారో లేదో... ఇండస్ట్రీలో ఆ డేట్ మీద ఆశలు పెంచుకున్న మిగిలిన హీరోల గుండెల్లో గుబులుమొదలైందనే అంటున్నారు క్రిటిక్స్. 2024 డిసెంబర్ మీద భారీ ఆశలే పెట్టుకున్నారు మిస్టర్ చైతన్య.

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి క్రేజ్ తెచ్చుకుంది. లవ్‌స్టోరీ తర్వాత చైతూ, సాయిపల్లవి కలిసి చేస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది.

అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసిన తేదీకే తండేల్ వస్తుందా? రాదా? గేమ్ చేంజర్ వస్తుందని తండేల్ సైడ్ ఇస్తుందా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ టాపిక్. ఈ టాపిక్‌లో నేనూ ఉన్నానంటున్నారు టాలీవుడ్ రాబిన్‌హుడ్ నితిన్.

గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్, ఈ ఏడాది ఎలాగైనా రాబిన్‌హుడ్‌తో సక్సెస్ చూడాలని ఫిక్స్ అయిపోయారు. డిసెంబర్ 20న నేనొస్తున్నాననహో అంటూ అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబిన్‌హుడ్‌కి థియేటర్లు దొరకడం సాధ్యమేనా? చెప్పిన టైమ్‌కి బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడం ఖరారేనా... ఇవన్నీ థౌజండ్ డాలర్ల ప్రశ్నలు.