గతంలో సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్ మార్కెట్ గురించే మాట్లాడుకునేవారు. ఆ తరువాత సాటిలైట్ గురించి కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ఓటీటీ బిజినెస్ ఎంట్రీతో అన్ని లెక్కలు మారిపోయాయి. ముందు డిజిటల్ బిజినెస్ అయితే తప్ప థియేట్రికల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.
ఆఫ్టర్ కోవిడ్ ఫిలిం ఇండస్ట్రీ ఓటీటీల మీద ఎక్కువగా డిపెండ్ అవుతోంది. టాప్ హీరోల సినిమాలకు సెట్స్ మీద ఉండగానే ఓటీటీ డీల్స్ పూర్తవుతున్నాయి. దీంతో ఆ కమిట్మెంట్స్‌కు తగ్గట్టుగా థియేట్రికల్ రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతోంది. ఈ డీల్స్ కారణంగానే కొన్నిసార్లు సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ క్లాష్‌లు తప్పటం లేదు.
త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల మీద ఓటీటీ సంస్థల ఒత్తిడి గట్టిగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్, తండేల్ లాంటి మూవీస్ డిజిటల్ కమిట్మెంట్స్ ప్రకారం డిసెంబర్‌లోనే థియేట్రికల్‌గా రిలీజ్ అవ్వాలి. కానీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ జనవరిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ డేట్ చెప్పిన తరువాత వరుసగా వాయిదాలు పడటం వెనుక కారణం కూడా ఓటీటీలే టాక్ వినిపిస్తోంది. షూటింగ్ టైమ్‌లో టెన్టెటివ్‌గా ఓ రిలీజ్ డేట్‌ను లాక్ చేస్తున్నారు. ఆ టైమ్‌కు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినా... ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప రిలీజ్ డేట్‌ను లాక్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో రిలీజ్‌లు వాయిదా వేసుకుంటున్నారు.