
రజనీకాంత్ నరసింహా మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1999లో రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీ సమయంలో థియేటర్లే సినీప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. అంతలా ఈ మూవీ తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రీ రిలీజ్‌ల జోష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతి తర్వలో నరసింహా మూవీ కూడా రీ రిలీజ్ కానున్నదంట.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పడయప్పా. తెలుగులో నరసింహాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ ఇండస్ట్రీకి పరిచయం అయి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ క్రేజీ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే రీ రిలీజ్‌కు మించి మరో క్రేజీ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు తలైవా.

1999లో రిలీజ్ అయిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ పడయప్పా. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ రజనీకి అపోజిట్‌గా ఓ హీరోయిన్‌ను విలన్‌గా చూపించి సక్సెస్ కొట్టారు దర్శక నిర్మాతలు. నరసింహాలో రజనీ స్టైల్ ఎంత కిక్కించిందో, రమ్యకృష్ణ విలనిజానికి కూడా అదే రేంజ్‌లో హై ఇచ్చింది.

ఇంత క్రేజ్ ఉన్న మూవీ కాబట్టే రీ రిలీజ్‌లోనూ స్పెషల్ కేర్ తీసుకుంది టీమ్. రజనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అదే సమయంలో మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. త్వరలో నరసింహా సీక్వెల్ పట్టాలెక్కుతుందని ఎనౌన్స్ చేశారు.

నరసింహా రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రజనీ క్రేజీ అప్‌డేట్ రివీల్ చేశారు. త్వరలో ఈ సినిమా సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. పార్ట్ 2కు నీలాంబరి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మరోసారి రమ్యకృష్ణ నీలాంబరిగా విశ్వరూపం చూపిస్తారన్నారు. అప్‌డేట్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.