తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన టాలీవుడ్ నటి అభినయ. శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగిపోయారు. కొన్ని రోజుల క్రితం తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇదిలా ఉంటే..మరికొన్ని గంటల్లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న అభినయ.. తాజాగా తన పెళ్లి వేడుకల ఫోటోస్ షేర్ చేసింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు టాక్. తాజాగా వీరి పెళ్లి వేడుకల ఫోటోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో అభినయ.. తన కాబోయే భర్త సన్నీ వర్మతో దిగిన ఫోటోస్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి.

తెలుగులోకి నేనింతే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అభినయ. ఆ తర్వాత శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే పని సినిమాతో మలయాళంలో మరో హిట్ అందుకుంది.