Rajeev Rayala |
Jan 22, 2022 | 8:09 PM
జైభీమ్.. గతేడాది చిత్ర పరిశ్రమలో ఈ పేరు పెద్ద ఎత్తున వినిపించింది. తమిళనాడులో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మారుమోగింది.
అనగారిన వర్గానికి చెందిన అమాయకుడిపై పోలీసులు తప్పుడు దొంగతనం ఆరోపణలతో దాష్టికానికి దిగితే అతని తరఫున పోరాటం చేసిన న్యాయవాది నిజ జీవితాన్ని ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
IMDBలో ఏకంగా 9.8 రేటింగ్‌ను సాధించి ఒక్కసారి దేశం దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. తమిళనాడులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు.
తాజాగా జైభీమ్ చిత్రం చైనాలోనూ విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్‌ఫామ్ అయిన డౌబన్‌లో 8.7 రేటింగ్‌ను దక్కించుకొని చైనీయులను సైతం విపరీతంగా ఆకట్టుకుంది.
జపాన్‌లో హత్యకు గురైన తన కుమార్తెకు న్యాయం చేసేందుకు చైనాకు చెందిన ఓ తల్లి చేసిన పోరాటాన్ని జైభీమ్ కథ పోలి ఉండడంతో ఈ సినిమాపై అక్కడ కూడా క్యూరియాసిటీ ఏర్పడింది.