
జైలర్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ కాంత్ నెక్ట్స్ మూవీస్ విసయంలో కూడా అదే జోరు చూపించేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ సెట్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు.

తాజాగా తలైవా కాంపౌండ్ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ అభిమానులకు కొత్త హై ఇచ్చింది.జైలర్ తరువాత జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రజనీ. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో మూవీని కన్ఫార్మ్ చేశారు రజనీకాంత్.

లియో తరువాత లోకేష్ చేయబోయే సినిమా ఇదే.ఎనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమా మీద రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ డ్రీమ్ కాంబోను తెర మీద ఆవిష్కరించబోతున్నారట లోకేష్.

ఆల్రెడీ లోకేష్ సినిమాలన్నీ ఓకే యూనివర్స్ అన్న క్లారిటీ వచ్చేసింది. అందులో భాగంగానే రజనీ సినిమాలో మరో టాప్ హీరో కూడా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది.రీసెంట్‌గా విక్రమ్ సినిమాతో కమల్ హాసన్‌కు మోస్ట్ నీడెడ్ హిట్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. ఈ క్యారెక్టర్‌ను రజనీ సినిమాలో కంటిన్యూ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఆల్రెడీ విక్రమ్ సినిమాలో ఖైదీ రిఫరెన్స్‌లు చూపించిన ఈ యంగ్ డైరెక్టర్, తలైవా 171లో విక్రమ్ క్యారెక్టర్‌ను కంటిన్యూ చేస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.80స్‌లో రజనీ, కమల్ కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇద్దరు బిగ్ స్టార్స్‌గా ఎదిగాక కలిసి నటించలేదు.

ఆ లోటును లోకేష్ తీర్చబోతున్నారన్నది ఇప్పుడు కోలీవుడ్ హాట్ న్యూస్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తల విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.