1 / 5
ఆర్నెళ్ళ కింది వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్నారు శ్రీలీల.. కానీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారీమే. రవితేజ సినిమా సైన్ చేసినా షూట్ నెమ్మదిగా సాగుతుంది. ఈ మధ్యే రవితేజకు సర్జరీ కావడంతో.. దానికి తగ్గట్టుగానే షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పాటు ఉస్తాద్, రాబిన్ హుడ్‌లలో కూడా నటిస్తున్నారు శ్రీలీల.