ఈ ఏడాది మనమేం సాధించాం అనే విషయాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కడుపు నిండిపోతోందని అంటున్నారు హీరోయిన్లు కొందరు. నార్త్ నుంచి ఇద్దరు, సౌత్ నుంచి ముగ్గురు ఈ లీగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరు వారు?
పెళ్లి చీరను, మళ్లీ కట్టుకునే గొప్ప అవకాశం వస్తుందని అనుకుని ఉండరు ఆలియా. కానీ గంగూభాయ్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంతకన్నా గొప్ప ఛాన్స్ రాదని పెళ్లి చీరలో మళ్లీ మెరిశారు.
ఆలియాతో కలిసి కృతిసనన్ కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్భంగా జాతీయ పురస్కారం అందుకోవడం గొప్ప అనుభూతి అంటారు కృతి.
ఉత్తరాది వాళ్లు ఎన్నిసార్లు పిలిచినా లాస్ట్ ఇయర్ వరకు పట్టించుకోలేదు నయనతార. తన అభిమాన నటుడు షారుఖ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అనేసరికి ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నారు. దానికి తగ్గట్టే జవాన్ వెయ్యికోట్లను దాటిన సినిమాల లిస్టులో చేరి, నయన్‌కి హ్యాపీడేస్‌ని మళ్లీ తెచ్చిపెట్టింది.
ఇటు అనుష్క కూడా 2023ని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రీ ఎంట్రీలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆమె కెరీర్‌లో మంచి సినిమాగా ప్రూవ్ చేసుకుంది. దీనికి తోడు భాగమతి2ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మలయాళం ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది అడుగుపెట్టారు స్వీటీ.
ఎప్పటి నుంచో హిందీలో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు రష్మిక మందన్న. ఆ అవకాశం ఆమెకు యానిమల్ సినిమా ఇచ్చింది. అంత వయొలెంట్‌గా ఉన్న కేరక్టర్ల మధ్య అందరినీ కూల్ చేసే గీతాంజలి కేరక్టర్‌లో అద్భుతంగా మెప్పించారు రష్మిక. 2023 తన కెరీర్‌లో ది బెస్ట్ అంటున్నారు నేషనల్ క్రష్.