Mani Ratnam: 33 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ – మణిరత్నం కాంబో.?
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న మణి, నెక్ట్స్ అంతకు మించి అన్న రేంజ్‌లో మరో కాంబోను సెట్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ కోలీవుడ్ మార్కెట్‌కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్ ఇచ్చింది.