
పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కవే. ఇది ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సినిమా. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసిది. చాలా మందితో సినిమా అంటే ఇదే అనేలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో మహేష్ బాబుకు మంచి బజ్ ఏర్పడింది.

పోకిరి సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. గుండా పండు పాత్రలో ఈ హీరో తననటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలియా కూడా తన గ్లామర్‌తో కుర్రకారును తన వైపుకు లాక్కుంది. పోకిరి మూవీ తర్వాత బారీగా రెమ్యునరేషన్ పెంచేసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

అయితే ఈ సినిమాను ముందుగా దర్శకుడు మహేష్ బాబుతో తీయాలి అనుకోలేదంట.ఈ సినిమాను ఒక హీరో కోసం రాసుకున్నాడంట. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమాను మహేష్ బాబుతో తీశాడంట. దర్శకుడు పూరి జగన్నాథ్. కాగా, అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోకిరి సినిమాను పూరి జగన్నాథ్ ఇప్పుడు విలన్‌గా తన సత్తాచాటుతున్న నటుడు సోనూసూద్ తో చేయాలని అనుకున్నాడట.ఆయన కోసమే కథను రాసుకున్నాడంట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో మహేశ్ తో చేసి హిట్ సాధించాడు. దీంతో పరిశ్రమలో అటు మహేశ్ కు ఇటు దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మంచి హిట్ తెచ్చిపెట్టింది పోకిరి చిత్రం.

అప్పటి వరకు మంచి హిట్లు లేని మహేష్ బాబుకు పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఈ మూవీతో సూపర్ స్టార్‌కు తిరుగే లేకుండా పోయింది. పోకిరి మూవీ రిలీజై ఆరోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమా విడుదలై నేటి 19 సంవత్సరాలు పూర్తి.