- Telugu News Photo Gallery Cinema photos Srinidhi Shetty gorgeous black and white photos goes viral in internet
Srinidhi Shetty: రవివర్మ గీసిన వదనమా.. లేక ఎల్లోరా శిల్పనికి ప్రతిరూపమా.. ఈ కోమలి..
శ్రీనిధి రమేష్ శెట్టి ఒక భారతీయ నటి మరియు మోడల్. ఆమె మిస్ సుప్రానేషనల్ 2016 పోటీ విజేత.ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయ ప్రతినిధి ఆమె. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో నామినేషన్‌తో పాటు శెట్టికి SIIMA అవార్డు కూడా ఉంది. ఒక నటిగా, శెట్టి అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ యాక్షన్ చిత్రాలైన K.G.F: చాప్టర్ 1, K.G.F: చాప్టర్ 2 లో ప్రధాన పాత్రలో నటించి కన్నడ ఉత్తమ నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది.
Updated on: Jul 10, 2024 | 4:12 PM

21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఈ వయ్యారి తండ్రి రమేష్ శెట్టి. ఆయనది ముల్కి పట్టణం. తల్లి పేరు కుశల. ఆమెది తాలిపాడు గుత్తులోని కిన్నిగోలి.

కర్ణాటకలోని మిల్పిలో శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మంగళూరులోని సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది ఈ భామ.

బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీలో డిస్టింక్షన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకుంది. 2012లో క్లీన్ & క్లియర్-స్పాన్సర్డ్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్‌లో పోటీ ఆమె మొదటి ఇద్దరి ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది.

తర్వాత 2015లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది. 2016లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్‌ను గెలుచుకుంది.

ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా తెలుసు కదా అనే ఓ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. దీంతో పాటు కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న కిచ్చ 47 మూవీలో కూడా ఓ పాత్రలో ఆకట్టుకోనుంది ఈ బ్యూటీ.




