
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాల్గొంటున్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు రాంచరణ్ సోమవారం ఉదయం శ్రీనగర్ చేరుకొన్నారు.

శ్రీనగర్‌కు బయలుదేరుతుండగా.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు రాంచరణ్ చిక్కారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ రాంచరణ్ మిలిటరీ క్యాప్ ధరించి.. బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్‌లో ఎయిర్‌పోర్టులో కనిపించారు.

శ్రీనగర్ బయలు దేరుతూ మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. సినిమా నటుడే కాకుండా నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఇంకా పలు వ్యాపారాల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే.