1 / 6
యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీసత్య. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంటుంది ఈ భామ. తొందర పడకు సుందర వదనా సీజన్ 1 & 2 సిరీస్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో కూడా చేసింది ఈ వయ్యారి. జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ వంటి జ్యువెలరీ బ్రాండ్‌ల ఫోటోషూట్‌లలో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.