
బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ప్రస్తుతం వరుసగా సినిమాలు.. ఇటు రియాల్టీ షోలకు హోస్టింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అందాల యాంకరమ్మ.

జులాయి సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. నేను శైలజ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సహయ నటింగా కనిపించి మెప్పించింది.

చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉండే శ్రీముఖి.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

పర్పుల్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా మెరిసిపోతుంది రాములమ్మ. స్టా్ర్ మాలో వస్తున్న సూపర్ సింగర్స్ షో కోసం ఇలా ముస్తాబయ్యింది శ్రీముఖి. ఎంతో అందంగా ఉంది కదా.