
బిగ్ బాస్ బ్యూటీ సోనియ ఆకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్జీవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. దీంతో తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ నటిగా మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది. కానీ అనుకోకుండా బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 8.. ఇన్ఫినిటీ లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చాలా హంగామా చేసింది. ముఖ్యంగా ఈ బ్యూటీ నెగిటివిటి సొంతం చేసుకుందనే చెప్పాలి. నిఖిల్ తో లవ్ అంటూ అనేక ట్రోల్స్ వచ్చాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌కు గట్టి కౌంటర్స్ ఇచ్చింది సోనియా.

సోనియా చాలా రోజుల క్రితం నుంచే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతనితో వివాహం సమయంలోనే తనకు బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఈ నటి, వివాహం వాయిదా వేసుకొని హౌస్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడితో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ఎప్పుడూ తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తనకు పెళ్లై 137 రోజులు గడుస్తున్న సందర్భంగా తన భర్తతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

చైనా వెకేషన్‌కు వెళ్లిన సోనియా కపుల్, అక్కడ తన పెళ్లై 137 వరోజును సెలబ్రెట్ చేసుకున్నారు. దీంతో ఈ బ్యూటీ పెళ్లి రోజు నుంచి ఇప్పుడు 137 రోజు. మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని చెబుతూ తన భర్తతో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.