
నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత, శోభితతో ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు వాటినే నిజం చేస్తూ.. 2024 డిసెంబర్‌లో చైతూ శోభితన రెండో వివాహం చేసుకున్నారు.

ఇక వీరి వివాహం తర్వాత చైతూ తండేల్ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అందరూ, శోభితా అడుగు పెట్టిన వేళా విశేషం చైతూ సూర్ హిట్ అందుకున్నారంటూ చెప్పుకొచ్చారు.

ఇక శోభితా పెళ్లి తర్వాత ఎప్పుడూ చైతూకు సంబంధించిన ఫొటోలు, వారు వెకేషన్స్ కి వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చైతూకు సంబంధించిన ఓ రేర్ పిక్ శోభితా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

నాగచైతన్య డీజే ఫ్లే చేస్తున్న ఫొటోను శోభితా షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఇందులో చైతూ, స్వెటర్ వేసుకొని, డీజే ప్లే చేస్తూ కనిపిస్తారు.

దీంతో నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.