
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

ఇక డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుందని సమాచారం. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో అన్ని రకాల ఏర్పాటు జరుగుతున్నాయని టాక్.

అటు శోభిత ఇంట్లోనూ ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గోధుమ రాయి, పసుపు దంచడం వంటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ఇటీవలే శోభిత కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.

తాజాగా శోభిత సోదరి సమంత ధూళిపాళ్ల మరికొన్నిఫొటోలను పంచుకుంది. పెళ్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ తన ఫ్యామిలీ పిక్స్‌ను పంచుకుంది.

ఇందులో తనతో పాటు శోభత, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.