
బిగ్ బాస్ షోలో రచ్చ చేసింది సిరి హన్మంతు. ఐదో సీజన్‌లో పాల్గొని ఆమె టాప్ 5కి చేరుకుంది. షో ద్వారా వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటూ దూసుకుపోతుంది. గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. ఆమె యూట్యూబ్ వీడియాలతో మరింతగా పాపులర్ అయ్యింది. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా, యూట్యూబర్‌గా, టీవీ నటిగా, సినిమా నటిగా ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌లోకి వచ్చింది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొంది సిరి. ప్రారంభం నుంచి తనదైన ఆట తీరుతో అలరించింది. చాలా తెలివిగా గేమ్స్ ఆడుతూ తాను ప్రత్యేకమని నిరూపించుకుంది. ఈ సీజన్‌లో టాప్ 5లో నిలిచింది. ఈ షోతో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయింది. షో అనంతరం సిరిలో చాలా మార్పు వచ్చింది. ఆమె గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది.

సిరి హన్మంతు బిగ్ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ఓ వైపు టీవీ షోస్, మరోవైపు యాంకర్‌గా, ఇంకోవైపు నటిగా రాణిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. హీరోయిన్‌గానూ మెప్పించేందుకు సిద్ధమవుతుంది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుంది. వర్క్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది.

సిరి, మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారని సమాచారం. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. సిరికి గతంలో ఓ లవ్ స్టోరీ ఉంది. అలాగే ఓ కొడుకుని పెంచుకుంటున్నారు.