
అందాల ముద్దుగుమ్మ సింగర్ శ్రేయా ఘోషల్ గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గాత్రానికే కాదు , అందానికి కూడా ప్రతి ఒక్కరూ ఫిదా అవుతుంటారు. ఈ బ్యూటీ సింగర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ సింగర్స్‌లో ఒకరిగా రాణిస్తుంది.

బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషాల్లో పాటలు పాడుతూ, తన సంగీతంతో అందరినీ మెప్పిస్తుంది. అద్భుతమైన పాటలు పాడుతూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ఈ అమ్మడుకు ఫ్యాన్ పాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఈ ముద్దుగుమ్మ పాడిన సాంగ్స్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. అనేక భాషాల్లో పాటలు పాడి పాన్ ఇండియా లెవల్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఈవెంట్ ఏదైనా సరే అక్కడ ఈ బ్యూటీ సాంగ్స్ తప్పక ఉంటుంది.

ముఖ్యంగా తెలుగులో, నమ్మిన నామది మంత్రాలయమే అంటూ అందరినీ ఆకట్టుకుంది. అదే విధంగా, పిల్ల గాలి అల్లరి, సూసేటి అగ్గిరవ్వ మాది, జల జల జలపాతం నువ్వు ఇలా చాలా సాంగ్స్ పాడి మంచి ఫేమ్ సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా మెరూన్ కలర్ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరీ మీరు కూడా ఈ అమ్మడు ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.