Shruti Haasan: శ్రుతిహాసన్ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి ??

Edited By: Phani CH

Updated on: Feb 13, 2025 | 9:46 PM

శ్రుతిహాసన్‌ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారా? సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారా? అంటే ఆన్సర్‌ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆమె చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ముందుంది మన ఫెస్టివ్‌ సీజన్‌ అంటూ ఫ్యాన్స్ తో హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకుంటున్నారు హాసన్‌ డాటర్‌.

1 / 6
లోకేష్‌ కనగరాజ్‌తో శ్రుతిహాసన్‌ చేసిన మ్యూజిక్‌ వీడియో చూసిన వారందరూ, వీరిద్దరూ కలిసి తప్పక ఓ సినిమా చేస్తారనుకున్నారు. ఆ సినిమాతోనే లోకేష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నవారు మాత్రం కాస్త డిసప్పాయింట్‌ అయ్యారు.

2 / 6
దానికి రీజన్‌ లోకేష్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. డైరక్టర్‌గానే కంటిన్యూ అయ్యారు. అయితే ఆయన సినిమాలో మాత్రం శ్రుతికి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ పేరు కూలీ.  కూలీ కోసం తలైవర్‌ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారో, శ్రుతి హాసన్‌ కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తున్నారు.

3 / 6
ఈ సినిమాలో శ్రుతి ఏ రోల్‌ చేశారో చూడ్డానికి ఆమె ఫ్యాన్స్ కూడా వెయిటింగ్‌ అన్నమాట. లాస్ట్ ఇయర్‌ సలార్‌తో సక్సెస్‌ అందుకున్నారు ఈ బ్యూటీ. ఈ ఏడాది కూలీ మూవీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు.

4 / 6
ప్రభాస్‌కి ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ ని చూస్తుంటే సలార్‌ సీక్వెల్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. సో ఆ కాల్షీట్లనే దళపతి 69కి ఇచ్చేశారనే టాక్‌ నడుస్తోంది. దళపతి 69లో ఆల్రెడీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

5 / 6
అలాంటప్పుడు శ్రుతి చేసే రోల్‌ ఏంటి? హీరోయిన్‌గానే కనిపిస్తారా? లేకుంటే స్పెషల్‌ గా ఆమె కోసం ఏమైనా కేరక్టర్‌ డిజైన్‌ చేశారా? అనే చర్చ జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం విజయ్‌ - శ్రుతి నటించిన పులి సినిమాను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

6 / 6
ఈ ఏడాది దళపతి 69తో పాటు ట్రైన్‌ మూవీ కూడా రిలీజ్‌ లిస్టులో ఉంది. విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన ఈ మూవీ మీద కూడా కోలీవుడ్‌లో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. సో, దీన్ని బట్టి 2025లో శ్రుతి కంప్లీట్‌గా కోలీవుడ్‌కి పరిమితమయ్యారన్నమాట.