సిగ్గు పడకే పిల్లా.. నవ్వుతో చంపేస్తున్న సీతారామం బ్యూటీ..
ఓ సీతా... అంటు టాలీవుడ్ కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. బాలీవుడ్‌లో బుల్లితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ,తన అందంతో అభిమానుల మనసు దోచుకొని వెండితెరపై సందడి చేస్తుంది. ముఖ్యంగా సీతారామం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కాగా, ఈ అమ్మడు తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్‌తో సందడి చేస్తుంది.
Updated on: Feb 13, 2025 | 9:10 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సీతారామం. ఈ మూవీలో మృణాల్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. సీత పాత్రలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత హాయ్ నాన్న వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.హీరో నాని సరసన హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది.ఈ మూవీ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటించింది. కానీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద నిరాశే మిగిలించింది.

ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు ఏవి రావడం లేదనే చెప్పాలి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ పై కన్నేసి అక్కడ పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ వరస ఫొటోలతో యూత్‌ను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూల పూల ట్రెండీ డ్రెస్‌లో తన వయ్యారాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా చక్కగా ఉంది. దీంతో చాలా క్యూట్‌గా ఉన్నా వు సీతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమ అభిమానులు.





























