- Telugu News Photo Gallery Cinema photos Do you know the first movie of Pawan Kalyan, Ram Charan and Tarak after marriage..?
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, తారక్ పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..?
మన టాలీవుడ్ హీరోలు చాలా మంది త్వరగా పెళ్లి చేసుకున్నారు. అయితే హీరోలు పెళ్లి చేసుకున్న తర్వాత చేసిన మొదటి సినిమాపైనే చాలా మంది ఫోకస్ చేస్తారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏ హీరో సక్సెస్ అయ్యారు?ఎవరు ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు ఇలా చాలా వాటి గురించి ఆడియన్స్ తెగ చర్చించుకుంటారు.
Updated on: Feb 13, 2025 | 8:57 PM

అయితే ఇప్పుడు మనం టాలీవుడ్ క్రేజీ , స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన నటించిన కొమురం పులి అనే సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

అలాగే ఈ హీరో అంజనా లెజినోవాను వివాహం చేసుకున్న తర్వాత గోపాల గోపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అందుకుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనను 2012 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నాయక్ సినిమా రిలీజై సూపర్ హిట్ అందుకుంది.

అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రణతిని 2012లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాత ఊసరవెల్లి సినిమా రిలీజ్ కాగా, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.





























