Shraddha Srinath: డాకు మహారాజ్ హిట్ అయితే ఈ అమ్మడికి ఢోకా లేనట్టే
తెలుగులో ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు నటనపరంగానూ ,మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.
Shraddha Srinath
Follow us on
శ్రద్దా శ్రీనాథ్.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. శ్రద్దా శ్రీనాథ్ 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘యూ టర్న్’ చిత్రానికి గాను ఆమె ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
తెలుగులో ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు నటనపరంగానూ ,మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది.
తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో జెర్సీ సినిమా తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా, సైంధవ్ సినిమాల్లో నటించింది. ఎందుకో ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు.
తెలుగులో చివరిగా మెకానిక్ రాకీ సినిమాలో మెరిసింది. ఈ సినిమా అంతగా కట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డాకు మహారాజ్ సినిమా హిట్ అయితే శ్రద్దా శ్రీనాథ్ క్రేజ్ పెరిగిపోతుంది. అలాగే తెలుగులో ఆఫర్స్ కూడా వరుసగా అందుకుంటుంది, మరి ఈ అమ్మడి కెరీర్ కూడా డాకు మహారాజ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.