అతిలోక సుందరి శ్రీదేవి నటించిన క్లాసిక్ మూవీస్‌లో నాగిన్ కూడా ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించిన శ్రీదేవి, ఆ క్యారెక్టర్‌కు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. అందుకే ఆ సినిమాను రీమేక్ చేయాలన్న ప్రపోజల్ చాలా సార్లు వచ్చినా... ఏ హీరోయిన్ ధైర్యం చేయలేదు. ఫైనల్‌గా హిట్ జోష్‌లో ఉన్న ఓ బ్యూటీ నాగిన్ క్యారెక్టర్‌లో నటించేందుకు ఓకే చెప్పారు.
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్.. కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే... పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవల్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయారు ఈ బ్యూటీ.
ఆషిఖీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన శ్రద్దా కపూర్.. ఆ తరువాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. తాజాగా స్త్రీ 2 సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకోని 500 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాందించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ సరసన చేరారు.
స్త్రీ 2తో ఆడియన్స్‌ను భయపెట్టిన శ్రద్ధా, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ బ్యూటీ లీడ్ రోల్‌లో నాగిన్ అనే మూవీని ఎనౌన్స్ చేశారు నార్త్ మేకర్స్. ఆల్రెడీ స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తి చేసిన టీమ్, నెక్ట్స్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.
నగినా సినిమాలో శ్రీదేవి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పిన శ్రద్ధా, ఫైనల్‌గా తన డ్రీమ్ రోల్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే నాగిన్‌లో లైన్‌లో పెట్టేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రద్ధా శ్రీదేవిని మరిపిస్తారేమో చూడాలి.