Shobha Shetty: హాట్ అందాలతో కుర్రకారును చిత్రహింసలు పెడుతున్న శోభా శెట్టి
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఈమె తెలుగు లో ఒక పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది. ఆ తెలుగు సీరియల్ మరేదో కాదు అందరిని అలరించిన కార్తీకదీపం. ఆ సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే.
Phani CH |
Updated on: Oct 03, 2024 | 9:19 PM

శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఈమె తెలుగు లో ఒక పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది.

ఆ తెలుగు సీరియల్ మరేదో కాదు అందరిని అలరించిన కార్తీకదీపం. ఆ సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది మోనిత కన్నడకు చెందిన నటి.

కార్తీకదీపం సీరియల్స్ లో నటించిన మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈ సీరియల్ తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చిన్న నుంచి పెద్ద వరకు అందరిని ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ సీరియల్ లో నెగిటివ్ పాత్ర పోషించింది కన్నడ బ్యూటీ శోభా శెట్టి.

కార్తీక దీపంలో నటించిన ఈ మోనిత (శోభా శెట్టి) పాత్రను బుల్లితెర ఆడియన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు. అసలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు. సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబులను చిత్ర హింసలు పెట్టిన మోనిత అంటుంటారు.

కార్తీక దీపం దర్శకుడు సీరియల్‌ను అటు తిప్పి ఇటు తిప్పి చాలా వరకు పొడిగించి చివరికి మళ్లీ కలుద్దాం అంటూ 1569వ ఎపిసోడ్‌తో ముగించేశాడు. దీంతో ఉత్కంఠ భరితం చూస్తున్న ఈ సీరియల్‌కు ఒక్కసారిగా ఎండ్ కార్డ్ పడటంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు.





























