ఎప్పటికప్పుడు సినిమాలు ఇక మానేస్తారేమో అనుకుంటున్న సమయంలో మరింత వేగంగా పని చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం ఈయన మూడు నాలుగు సినిమాలకు కమిటయ్యారు.
అందులో కూలీ సెట్స్‌పై ఉండగా.. మరో రెండు సెట్స్‌పైకి రావడానికి రెడీ అవుతున్నాయి. కూలీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. కూలీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్‌తో కలిసి నటిస్తున్నారు రజినీకాంత్.
దీనికి ముందు వేట్టయాన్‌లో అమితాబ్ బచ్చన్, జైలర్‌లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలతో నటించారు రజినీ. ఇప్పుడు జైలర్ 2లోనూ ఇదే కంటిన్యూ కానుంది. ఈ మధ్యే సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.
జైలర్ 2లో రజినీకాంత్‌తో పాటు బాలయ్య కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి జైలర్‌లోనే బాలయ్యను తీసుకోవాలని ప్లాన్ చేసారు నెల్సన్. కానీ అప్పుడు అనివార్య కారణాలతో అది కుదర్లేదు. దాంతో సీక్వెల్‌కు బాలయ్య కచ్చితంగా తీసుకోవాలని ఫిక్సైపోయారు.
బాలయ్య, రజినీ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. జైలర్ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమాకు కమిటయ్యారు. ఇది జూన్ తర్వాత మొదలయ్యే అవకాశముంది. వీటితో పాటే జైలర్ 2లో బాలయ్య నటించొచ్చు.