Rajeev Rayala |
Updated on: May 15, 2022 | 8:05 PM
`అర్జున్ రెడ్డి` హిట్ తో ముంబై బ్యూటీ షాలిని పాండే టాలీవుడ్ కెరీర్ కి తిరుగుండదని భావించారు
అదే సమయంలో బాలీవుడ్ లో `మేరీ నిమ్మో` చిత్రంలో..`మహానటి`.. `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది.
`118` లో లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ మినిమం రేంజ్ హీరోల సరసన ఇప్పటికీ అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడే ఉంది. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని తమిళ్..హిందీ సినిమాల్లోనూ నటించింది. కానీ అక్కడా సక్సెస్ కాలేదు.
`ఆర్ ఎక్స్ -100` సక్సెస్ తర్వాత పాయల్ కూడా పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు.
అందం..అభినయం.. ఒడ్డు పొడవు అమెని శిఖరాగ్రాన నిలబెడతాయని నిపుణులు అంచనా వేసారు. కానీ ఆ భామ సక్సెస్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించలేకపోయింది.
తొలి సక్సెస్ కేవలం అవకాశాలకే పునాది వేసింది తప్ప రేసులో రాణించలేకపోయింది.అందివచ్చిన ఛాన్సెస్ తో సక్సెస్ కొడితే తప్ప ట్రాక్ లో పడటం కష్టమనే విమర్శ వినిపిస్తుంది.